కరీంనగర్ కార్పొరేషన్‌లో రెండు డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. గురువారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యే సరికి 20, 37వ డివిజన్‌లలో ఒక్కో అభ్యర్థి మాత్రమే బరిలో మిగిలారు. దీంతో వీరి ఎన్నిక లాంఛనప్రాయమైంది. ఈ మేరకు ఆయా డివిజన్లలో ఇద్దరు తెరాస అభ్యర్థులు ఏకగ్రీవయ్యారు.
ఏకగ్రీవం పట్ల మంత్రి గంగుల కమలాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మె సమయంలో ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేశారని... అందుకే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెపుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం వల్లనే ప్రజలు తమకు పట్టం కడుతున్నారని వ్యాఖ్యానించారు.