ఇప్పటి వరకు సింగరేణి వర్క్ షాపు బ్లాస్టింగ్ తయారీ షెడ్లలో మాత్రమే మహిళలు పనిచేస్తున్నారు. గనుల్లో ఉపయోగించే యంత్రాలను 35 ఏళ్లుగా వీరే మరమ్మతులు చేస్తున్నారు. ఇకపై గనుల్లోనూ ప్రవేశం లభించనుంది. మగవారికి దీటుగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల, పారిశ్రామిక శిక్షణ విద్యార్థినిలు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. తాము చదువుతున్న సంస్థలోనే ఉద్యోగాలు లభిస్తాయని సంతోష పడుతున్నారు.