హైదరాబాద్ శామీర్‌పేట్‌లోని ఈటల రాజేందర్ నివాసంలో కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట నాయకులు రాజేందర్‌తో భేటీ అయ్యారు. తాజా రాజకీయాలపై చర్చించారు.
ఈటల కలిసిన వారిలో ఇల్లందకుంట ఎంపీపీ సరిగొమ్మాల పావని, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు ఉన్నారు. ఈటల తీసుకునే నిర్ణయానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని నేతలు వెల్లడించారు.
ఇదీ చదవండి: కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ముగ్గురు మృతి