కొనుగోలు చేయడానికి వీలులేని భూములు కొన్నట్లు ఒప్పుకున్న మంత్రి ఈటల వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే ఈటలను అరెస్టు చేసి సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. మెడికల్ కాలేజీ, ఐదు ఎకరాల్లో ఇల్లు ఎలా కట్టారని ప్రశ్నించారు.
బీసీలకు ప్రతినిధిని అని చెప్పుకునే ఈటల.. కుమార్తె, కుమారునికి ఇతర సామాజిక వర్గం పేరు ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో అవినీతి లేదన్న ఈటల.. బినామీల ద్వారా ఈటల కమీషన్లు వసూల్ చేశారని ఆరోపించారు.
- ఇదీ చదవండి : వాస్తవాలన్నీ బయటకు రావాలి: ఈటల రాజేందర్