ETV Bharat / state

huzurabad by election: 19 మంది అభ్యర్థుల నామినిషన్లు తిరస్కరణ - ఈటల రాజేందర్​ తాజా వార్తలు

హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోరు... నువ్వానేనా అనే స్థాయిలో జోరుగా సాగుతోంది. ప్రధానంగా హరీశ్‌రావు, ఈటల మధ్య... మాటల యుద్ధం తారస్థాయికి చేరుతోంది. ఇరువురు నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇక ఉప ఎన్నికపోరులో 61 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. బరిలో 42 మంది మిగిలారు (huzurabad by election nominations). ఈ నెల 13న నామపత్రాల ఉపసంహరణ కార్యక్రమం ఉంది.

ETELA HARISH RAO
ETELA HARISH RAO
author img

By

Published : Oct 12, 2021, 5:26 AM IST

Updated : Oct 12, 2021, 6:22 AM IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల నామపత్రాల పరిశీలన కార్యక్రమాన్ని... రిటర్నింగ్‌ అధికారి పూర్తి చేశారు (huzurabad by election nominations). మొత్తం 61 మంది అభ్యర్థులు 92 నామపత్రాలను దాఖలు చేశారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి రవీందర్‌రెడ్డి... అభ్యర్థులు దాఖలు చేసిన నామపత్రాలు ఒక్కొక్కటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 19 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 23 నామపత్రాలు తిరస్కరణకు గురైనట్లు రిటర్నింగ్‌ అధికారి వెల్లడించారు. ఉప ఎన్నికల బరిలో 42 మంది ఉన్నట్లు ప్రకటించారు. ఈ నెల 13న నామపత్రాల ఉప సంహరణ కార్యక్రమం ఉంటుందన్నారు. అదే రోజు చివరి జాబితాను ప్రకటిస్తామని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (election returning officer) స్పష్టం చేశారు.

ఈసారి గెల్లు శ్రీనివాస్​కు అవకాశం ఇవ్వండి..

దసరా నవరాత్రుల వేళ.. ఉపఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది (huzurabad by election). హుజూరాబాద్ నుంచి ఇప్పటి వరకు 6 పర్యాయాలు ఈటల రాజేందర్‌ను గెలిపించారని.. ఈ ఒక్కసారి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు (gellu Srinivas yadav) అవకాశం ఇవ్వాలని.. మంత్రి హరీశ్‌రావు ( harish rao) పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని కనగర్తిలో జరిగిన ధూంధాంలో మంత్రి పాల్గొన్నారు. అంతకుముందు కరీంనగర్‌ - హనుమకొండ జిల్లాల సరిహద్దులోని పెంచికలపేటలో ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌... సన్మాన సభకు మంత్రి హాజరయ్యారు. తప్పుడు ప్రచారంతో ఈటల (etela rajender) సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారని.. మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఈటల చెప్పే ఝూటా మాటలు నమ్మి.. భాజపాకు ఓటు వేయవద్దని మంత్రి కోరారు.

వాళ్లిచ్చినవి తీసుకోండి.. ఓటు మాకే వేయండి

ప్రజలందరూ మా జేబుల్లో ఉన్నారని... ఎవరికి చెబితే వారికే ఓటు వేస్తారని తెరాస నాయకులు భావిస్తున్నారని.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌ పట్టణంలో ఈటల... జమ్మికుంట (jammi kunta) మండలంలో ఆయన సతీమణి జమున (etela jamuna) ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలు ప్రజలు కోరుకున్నవి కాదని... కేసీఆర్ బలవంతంగా రుద్దిన ఎన్నికలని ఈటల పేర్కొన్నారు. అలాగే తెరాస ఇచ్చే అన్ని సౌకర్యాలు తీసుకుని... ఓటు మాత్రం భాజపాకే వేయాలని ఈటల కోరారు.

రోడ్డు పక్క షాపులో టీ టేస్ట్​ చేసిన హరీశ్​రావు

ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. జమ్మికుంటలో ఓ వృద్ధుడు నిర్వహిస్తున్న... టీ దుకాణానికి వెళ్లి తేనీరు తాగి అక్కడి వారిని.. మంత్రి ఆశ్చర్యానికి గురి చేశారు.

ఇదీ చూడండి: Huzurabad: వాడివేడిగా ఉపఎన్నిక ప్రచారం.. కొనసాగుతున్న విమర్శల పర్వం

Last Updated : Oct 12, 2021, 6:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.