ETV Bharat / state

Etela Rajender: 'నన్ను ఓడించలేక... బోగస్ ఓట్లు నమోదు చేస్తున్నారు' - ఈటల రాజేందర్ వార్తలు

తెరాస విమర్శలను.. భాజపా హుజురాబాద్‌ అభ్యర్థి ఈటల రాజేందర్ తిప్పికొట్టారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో.. అధికార పార్టీ మైండ్ గేమ్‌తో గెలిచేందుకు యత్నిస్తోందని, అది ఇక్కడ సాధ్యం కాదని... హెచ్చరించారు. తెరాస మంత్రులు బోగస్ ఓట్ల నమోదుకు తెర లేపారని ఆరోపించారు.

Etela Rajender
ఈటల రాజేందర్
author img

By

Published : Oct 7, 2021, 11:53 AM IST

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ (తెరాస) మైండ్ గేమ్‌ ఆడి గెలిచేందుకు యత్నిస్తోందని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఆరోపించారు. మైండ్​ గేమ్​ ఆడడం మానుకోవాలని.. అది ఇక్కడ సాధ్యం కాదని హెచ్చరించారు. కమలాపూర్​ మండలంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో సతీమణి జమునతో కలిసి ఈటల పాల్గొన్నారు.

మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏది లేదని పేర్కొన్నారు. తెరాస మంత్రులు తనతో పోటీ పడలేక బోగస్​ ఓట్ల నమోదుకు తెర లేపారని ఆరోపించారు. దీనిపై ఎన్నికల కమిషన్​కు ఇప్పటికే ఫిర్యాదు చేశామని వెల్లడించారు. కేసీఆర్​తో పోరాడేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు.

ఇదీ చూడండి: DUSSEHRA CELEBRATIONS 2021: బాలత్రిపుర సుందరీదేవి అలంకరణలో.. భద్రకాళి అమ్మవారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.