హుజూరాబాద్ ఉపఎన్నికల్లో(huzurabad by election) ఎలాంటి ఫలితం రాబోతుందన్న అంశాన్ని రాష్ట్ర ప్రజలంతా ఆసక్తితో గమనిస్తున్నారని భాజపా జాతీయ నాయకులు మురళీధర్‌రావు అన్నారు. భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా ఆయన బోర్నపల్లిలో ప్రచారం నిర్వహించారు. తెరాస మనుగడ, కుటుంబ పాలన కొనసాగాలంటే ప్రశ్నించే వారు ఉండొద్దని ఈటలను గెలవకుండా కేసీఆర్ అడ్డగోలు ఆలోచనలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలోని ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒక్క హుజూరాబాద్‌లోనే ఈటల రాజేందర్‌ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు.
హుజూరాబాద్ ప్రజల మీద నమ్మకంతోనే కేసీఆర్ మీద ఈటల రాజేందర్(etela rajender) యుద్ధం ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఈటల ఎండ వాన లేకుండా, కుటుంబాన్ని వదిలిపెట్టి పని చేస్తే... కేసిఆర్ ఇప్పుడు ఈటల రాజేందర్‌ను బయటికి పంపించారని మురళీధర్ రావు పేర్కొన్నారు. ఆయనను ఓడించాలని కేసిఆర్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడటం కోసం, కుటుంబ పాలనను అంతం చేయడానికి ఈటల రాజేందర్‌ను గెలిపించాలని మురళీధర్‌రావు కోరారు.
తెలంగాణ ఉద్యమం కోసం ఎండ వాన లేకుండా, కుటుంబాన్ని వదిలిపెట్టి పని చేస్తే పార్టీ నుంచి బయటకు పంపించారు. కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలకాలంటే ఈటల రాజేందర్‌కు ఓటేసి గెలిపించాలి. -మురళీధర్ రావు, భాజపా జాతీయ నాయకులు
ఎవరు గెలిచినా పథకాలు ఆగవు..
ఎన్నడూ కనపడని నాయకులు, మంత్రులు ఇక్కడ అడ్డా పెట్టారని.. దావత్‌లు ఇచ్చి తనను ఓడగొట్టాలని చూస్తున్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో కేసీఆర్ నికృష్ట రాజకీయాలు చేస్తున్నారని.. ఆ పిచ్చి పనులకు ఈ నెల 30న చరమగీతం పాడాలని ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. తెరాస జెండా కట్టకపోతే దళిత బంధు రాదంటున్నారని ఈటల ఆరోపించారు. ఎవరు గెలిచినా.. ఎవరు ఓడినా పథకాలు ఆగవన్నారు. గెలుపుపై నమ్మకం లేకనే ఓటర్లను బెదిరిస్తున్నారని ఈటల ఆరోపించారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆత్మగౌరవానికి పట్టం కట్టాలని ఈటల ఓటర్లను కోరారు.
డప్పు కొట్టకపోతే దళిత బంధు రాదంటున్నారు. తెరాస జెండా కట్టకపోతే దళిత బంధు రాదంటున్నారు.ఎవరు గెలిచినా.. ఎవరు ఓడినా పథకాలు ఆగవు. గెలుపుపై నమ్మకం లేక ఓటర్లను బెదిరిస్తున్నారు.ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఈటలనే గెలిపించండి. . హుజూరాబాద్‌లో కేసీఆర్ నికృష్ట రాజకీయాలు చేస్తున్నారు. ఆ పిచ్చి పనులకు ఈ నెల 30న చరమగీతం పాడాలి. -ఈటల రాజేందర్, హుజూరాబాద్ భాజపా అభ్యర్థి
ఇదీ చదవండి: CM KCR: ఈనెల 25 తర్వాత హుజూరాబాద్‌లో కేసీఆర్ సభ