కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండకు చెందిన హోంగార్డు.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. గత కొద్దిరోజుల క్రితం గొల్లపల్లి ఎస్సైకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. సదరు ఎస్సైకి డ్రైవర్‌గా పనిచేసిన హోంగార్డు అనారోగ్యంతో స్వగ్రామం ఆర్నకొండకు వెళ్లాడు. అనంతరం వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలడం వల్ల వైద్యాధికారులు హోంగార్డును హైదరాబాద్‌కు తరలించారు.
అదే పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన కానిస్టేబుల్‌కు పాజిటివ్ అని తేలడం వల్ల కరీంనగర్లో హోం క్వారంటైన్ చేశారు. రెండు గ్రామాల్లో పాజిటివ్ నిర్ధారణ ఉదంతాలు స్థానికంగా నివాసం ఉండని వారు కావడం వల్ల అధికారులు.. ప్రైమరీ కాంటక్ట్ సమస్య లేదని ఊరట చెందారు.
ఇదీ చూడండి: విదేశీ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా 'ఎలిమెంట్స్'