ETV Bharat / state

హెర్బల్​ పానీపూరీ షాప్​తో వావ్​ అనిపిస్తోన్న ఫార్మసీ విద్యార్థిని - పూర్ణిమ పానీపూరి సక్సెస్​ స్టోరి

Herbal Panipuri Shop in Karimnagar : ఆత్మసంతృప్తికి మించినదేదీ లేదని ఆమె ప్రగాఢ విశ్వాసం. అందుకే నీ విద్యార్హతకు సరితూగని పని ఎందుకు చేస్తావన్న మాటలనూ లెక్కచేయలేదు. నచ్చిన పనిలోనే ఆనందం వెతుక్కోవాలని భావించింది. వెనుకంజ వేయకుండా.. ధైర్యంతో అనుకున్న పని మొదలుపెట్టింది. ఉపాధ్యాయ వృత్తి వదిలి మరీ సరికొత్త పంథాలో పానీపూరి అమ్మేస్తోంది ఆ యువతి. తన తెగువతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. విభిన్నంగా ముందుకు సాగుతోంది. తనే కరీంనగర్​కు చెందిన కొప్పుల పూర్ణిమ. ఆమె గురించి ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Herbal Panipuri Shop in Karimnagar
MPharmacy Panipuri Valley Shop in Karimnagar
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2023, 8:03 PM IST

హెర్బల్​ పానీపూరీ షాప్​తో వావ్​ అనిపిస్తోన్న ఫార్మసీ విద్యార్థిని

Herbal Panipuri Shop in Karimnagar : కరోనా తర్వాత ప్రతి ఒక్కరిలో ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగింది. ఏ ఆహారం తీసుకున్నా అది తమ ఆరోగ్యానికి ఎంతమేరకు ఉపయోగకరం అనే విషయాన్ని బేరీజు వేసుకుంటున్నారు. సాయంత్రం సమయాన బయటకి వచ్చినప్పుడు పానీపూరీ ఛాట్‌ బండార్ కనిపిస్తే తినకుండా ఉండలేం. ఈ సంగతి తెలిసిన కొప్పుల పూర్ణిమకు కొత్త ఆలోచన వచ్చింది. తను చదివినా ఎంఫార్మసీ.. పానీపూరి షాప్​కు ఎలా వినియోగించుకోవాలో ఆలోచించి. దీంతో వినూత్నంగా హెర్బల్ పానీపూరీని అందుబాటులోకి తీసుకొచ్చింది. తాను ప్రారంభించిన వ్యాపారానికి అనూహ్య స్పందన లభిస్తుండటంతో విస్తరించే దిశగా అడుగులేస్తోంది.

MPharmacy- Panipuri Valley Shop in Karimnagar : ఎంత చదువు చదివినా.. ఆత్మ సంతృప్తి లేని ఉద్యోగం చేయబోనని చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి. కరీంనగర్‌కి చెందిన కొప్పుల పూర్ణిమ మాత్రం ఆత్మసంతృప్తి కోసం తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలివేసింది. ఎంఫార్మసీ(MPharmacy Student Panipuri Shop) చదివినా తనకు నచ్చిన విధంగా హెర్బల్‌ పానీపూరీ బంఢార్‌ ఏర్పాటు చేయాలని అనుకుంది. ఉన్నత చదువులు చదివామని గొప్పలకు పోకుండా పానీపూరీ అమ్మేస్తూ శభాష్‌ అనిపించుకుంటోంది. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి కరీంనగర్‌లో ‘ఎంఫార్మసీ- పానీపూరీ వాలీ’ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించింది.

IAS కావాలనుకొని 'BTech పానీపూరివాలా'గా- యువతి సక్సెస్​ స్టోరీ అదుర్స్​

"నేను స్సూల్స్​లో పని చేశాను. అంత సంతృప్తి కలగలేదు. నాకు బిజినేస్​ పెట్టాలని అనుకున్నాను. ఎక్కువ మంది ఇష్టపడేది పానీపూరి. ఆరోగ్యానికి మంచిగా ఉండే పానీపూరి తయారు చేయాలని అనుకుని ఈ షాపు పెట్టాను. హోంమేడ్ మసాలాతో తయారు చేస్తున్నాను. కస్టమర్స్​ నుంచి మంచి స్పందన వస్తుంది. త్వరలోనే మరో బ్రాంచ్​ పెడదామని అనుకుంటున్నాను." - కొప్పుల పూర్ణిమ,ఎంఫార్మసీ విద్యార్ధిని,కరీంనగర్

Young Women Panipuri Shop in Karimnagar Story : కొంతమంది పూర్ణిమ పెట్టిన పానీపూరి షాప్(Panipuri Shop in Karimnagar) చూసి.. ఇంత చదువూ చదివి పానీపూరీలు అమ్ముతున్నావా అంటూ తక్కువ చేసి మాట్లాడినా.. తను మాత్రం కుంగిపోలేదు. ఎడారిలో కూడా పూలూ పూయించొచ్చనేది తన అభిప్రాయం అంటూ పూర్ణిమ ముందుకు సాగుతోంది. ఇరుగుపొరుగు మాటలను పట్టించుకోకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. కరీంనగర్‌లో ఓ ప్రైవేటు పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. కొన్నాళ్లు మెడికల్‌ షాపూ నిర్వహించింది. అవేవీ తనకు సంతోషాన్నివ్వలేదు.

ఇది ఏటీఎం కాదు.. పానీపూరీ మెషిన్​.!

ఉద్యోగం చేస్తున్న సమయంలో వ్యాపారం చేద్దామని పూర్ణిమ ఆలోచించింది. దీంతో పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టపడే పానీపూరీ వ్యాపారాన్ని వినూత్నంగా నిర్వహించాలనుకొని దానికి శ్రీకారం చుట్టింది. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సాధారణ పానీపూరీలతో పాటు పుదీనా, జీలకర్ర, ఎల్లిపాయలు, ఇంగువ, కట్టామీఠా, చిల్లీ, వంటి హెర్బల్‌ పానీపూరీలెన్నో అందిస్తోందని ఆమె తెలిపింది.

Pharmacy Student Panipuri Shop Success Story : వినూత్నంగా ఏర్పాటు చేసిన హెర్బల్ పానీ పూరీ(Herbal Panipuri Shop)కి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని.. ఈ షాపు గురించి విస్తృతంగా ప్రచారం జరగడంతో పానీపూరీ తినేవారు క్యూకడతున్నారని పూర్ణిమ పేర్కొంది. పానీపూరీకి హెర్బల్‌ తోడు కావడంతో రుచికరంగా ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు. తక్కువ సమయంలోనే హెర్బల్‌ పానీపూరీ బండికి ఆదరణ పెరిగింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి వినియోగదారులు వస్తున్నారని ఆమె హర్షం వ్యక్తం చేస్తోంది. త్వరలోనే మరిన్ని ప్రాంతాల్లో ఫ్రాంచైజీ పద్ధతిలో పానీపూరీ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ వ్యాపారాన్ని విస్తరించనుందని తెలిపింది.

పానీపూరీ అమ్ముకుంటున్న డాక్టర్​.. ఆస్పత్రికి తాళం వేసి మరీ వ్యాపారం.. ఎందుకంటే..

Panipuri : నోరూరించే పానీపూరీ.. దీని కథ మీకు తెలుసా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.