కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, ముదిమాణిక్యం గ్రామాల్లో రైతు వేదికలను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే సతీశ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. రైతులు అభివృద్ధి చెందినప్పుడే అన్ని వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని ఈటల అన్నారు. 135 కోట్ల జనాభా కలిగిన భారత దేశంలో ఇప్పటికీ 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని గుర్తు చేశారు.
మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గానికి త్వరలో గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం ఈసారి దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో కలిపి 1 కోటి 5 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే, అందులో 62 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సమకూర్చిన ఘనత తెలంగాణకు దక్కిందన్నారు. నేడు దేశంలో కరువు వస్తే అన్నం పెట్టే సత్తా తెలంగాణకే ఉందన్నారు. రైతు వేదికలను సద్వినియోగం చేసుకొని తక్కువ ఖర్చులతో ఎక్కువ లాభాలను ఆర్జించే పంటలను పండించాలని రైతులను కోరారు.
ఇదీ చదవండి: శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి హరీశ్