కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కంటైన్మెంట్ కాలనీల్లో ఆహార ప్యాకెట్లను, నిత్యావసర సరుకులను కార్పోరేటర్ జయశ్రీ పంపిణీ చేశారు. నిత్యావసరాల కోసం బయటకు వచ్చిన ప్రజలు ఉదయం 11 గంటల వరకే ఇంటికి చేరుకుని స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. లాక్ డౌన్ ముగిసేంత వరకు ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆమె సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వస్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కోరారు. లాక్ డౌన్ ముగిసేంత వరకు భాజపా ఆధ్వర్యంలో దాతల సహకారంతో తమ వంతు సహకారాన్ని అందిస్తామని జయశ్రీ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : లాక్‌డౌన్ అమలు చేస్తేనే కరోనా వ్యాప్తి డౌన్!