కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గ్రామాల్లో వేలాదిగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ముగ్ధ మనోహరంగా కనువిందు చేస్తున్నాయి. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణకు సరైన చర్యలు తీసుకుని, క్రమం తప్పకుండా నీరు సరఫరా చేయడం వల్ల మొక్కలు ఏపుగా పెరిగాయి. రామడుగు మండలంలోని వెలిచాల, కిష్టాపూర్ గ్రామాల్లో పండ్ల తోటల పెంపకం చేపట్టారు. ప్రతి గ్రామానికి అందుబాటులో నర్సరీలు ఉండడం వల్ల పచ్చదనం వెల్లివిరుస్తోంది.
- ఇదీ చూడండి : దుబాయిలో ఘనంగా దీపావళి సంబురాలు