టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వకుండా విద్యావాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్లో టీఆర్టీ అభ్యర్థులు వినూత్న నిరసన చేపట్టారు. అనంతరం తెలంగాణ చౌక్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు అభ్యర్థులు భిక్షాటన చేశారు. తమకు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యమని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎంపికైన వారికి ఉద్యోగాలు కల్పించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.
![EMPLOYMENT FOR QUALIFIED CANDIDATES](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/3106667_trt.png)
ఇవీ చూడండి : తెజస అభ్యర్థులకు అగ్గిపెట్టె, గ్యాస్‌సిలిండర్ గుర్తులు