తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద గాయత్రి పంప్ హౌస్ వద్ద మూడవ పంపు వెట్రన్ విజయవంతమైంది. తెల్లవారుజామున రెండున్నర గంటలకు మూడో పంపుతో గోదావరి నది జలాలను ఎత్తిపోశారు. గత రెండు రోజులుగా రెండు పంపులు మాత్రమే నడిచాయి. ఈ రోజు మూడో పంపు కూడా ప్రారంభమైంది. మూడు పంపులతో ఒక టీఎంసీ నీటి ఎత్తిపోత ప్రక్రియ మొదలైంది.
ఇదీ చూడండి : ఆరోగ్యశ్రీ బంద్... 'గాంధీ'లో కిటకిట