ETV Bharat / state

గంజాయి ఘరానా ముఠా అరెస్ట్​... 5 కిలోల సరుకు స్వాధీనం

గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా నడుపుతున్న గంజాయి అక్రమ దందాను కరీంనగర్ జిల్లా సైదాపూర్​లో పోలీసులు గుట్టురట్టు చేశారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. లక్షా 18 వేల రూపాయల విలువైన 5 కిలోల గంజాయి, 2 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ganjai gang arrested in  saidhapur
ganjai gang arrested in saidhapur
author img

By

Published : Jul 5, 2020, 10:58 PM IST

కరీంనగర్ జిల్లా సైదాపూర్​లో గంజాయి సరఫరా చేస్తున్న ఘరానా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా నడుపుతున్న అక్రమ దందాను పక్కప్రణాళికతో పోలీసులు గుట్టురట్టు చేశారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. లక్షా 18 వేల రూపాయల విలువైన 5 కిలోల గంజాయి, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు.

నిందితులు జల్సాలకు అలవాటు పడి... సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ దందాను మొదలుపెట్టారని పోలీసులు వెల్లడించారు. ఆరుగురు ఒక ముఠాగా ఏర్పడి... ములుగు జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేస్తున్నారన్నారు. సైదాపూర్ మండలంలోని గుండ్లపల్లిని కేంద్రంగా చేసుకుని.. యువకులు, విద్యార్థులకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి: వ్యవస్థీకృత జాడ్యాల వికృతరూపం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.