Gangula Kamalakar Challenge to Etela : బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్(MLA Etela Rajender)కు దమ్ముంటే ఒక్క గజ్వేల్ నుంచి మాత్రమే పోటీ చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2023) రెండు చోట్ల పోటీ చేస్తానన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై కరీంనగర్ జిల్లా చింతకుంటలో మంత్రి ఘాటుగా స్పందించారు. ఆయనకు దమ్ముంటే గజ్వేల్‌లో మాత్రమే పోటీ చేయాలని.. హుజూరాబాద్‌లో కూడా బరిలో నిలుస్తానంటే భయపడినట్లేనా అంటూ ప్రశ్నించారు.
Gangula Kamalakar on MLA Etela Rajender : కాంగ్రెస్(Telangana Congress), బీజేపీ బీ-ఫారాలు దిల్లీలో ఒకే చోట సిద్ధమవుతాయని.. ఈ రెండు పార్టీలు కలిసే ఉంటాయని గంగుల కమలాకర్ ఆరోపించారు. అందుకే అభ్యర్థులను ప్రకటించడానికి ఆలస్యమౌతోందని దుయ్యబట్టారు. బీజేపీకి తెలంగాణలో గుండు సున్నా వస్తుందని.. ఆ భయంతోనే ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేస్తానని అంటున్నారని ఎద్దేవా చేశారు. మతతత్వ పార్టీలకు, భూ కబ్జాలకు పాల్పడే పార్టీలకు అధికారం ఇవ్వొద్దని మంత్రి ప్రజలను కోరారు.
'ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు దమ్ముంటే ఒక్క గజ్వేల్ నుంచి మాత్రమే పోటీ చేయాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రెండు చోట్ల పోటీ చేస్తానన్నారు. ఆయనకు దమ్ముంటే గజ్వేల్‌లో మాత్రమే పోటీ చేయాలి. హుజూరాబాద్‌లో కూడా బరిలో నిలుస్తానంటే భయపడ్డారా మీరు. కాంగ్రెస్, బీజేపీ బీ-ఫారాలు దిల్లీలో ఒకే చోట సిద్ధమవుతాయి. ఈ రెండు పార్టీలు కలిసే ఉంటాయి. వాళ్లకి అందుకే అభ్యర్థులు ప్రకటించడానికి ఆలస్యమౌతుంది.' -గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
Gangula Kamalakar Fires on AP Leaders : ఆంధ్రానేతలపై మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) మరోసారి విరుచుకుపడ్డారు. వైఎస్ షర్మిల, కేఏ పాల్, కేవీపీ రామచందర్ రావు, కిరణ్ కుమార్ రెడ్డిలకు తెలంగాణలో ఏం పని అంటూ ప్రశ్నించారు. వారిని అసలే నమ్మొద్దని.. బీజేపీ ముసుగులో వచ్చి తెలంగాణను తిరిగి ఆంధ్రాలో కలపాలని కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు. యువతకు గంజాయి అలవాటు చేస్తున్నారని.. కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్(BJP Leader Bandi Sanjay) చేస్తున్న ఆరోపణలను పట్టించుకోమని తేల్చి చెప్పారు.
Etela Rajendar Counter To KTR Tweet : 'మోదీపై విమర్శలు.. కేసీఆర్ రెండు నాలుకల ధోరణికి నిదర్శనం'
ఆ ప్రచారంలో నిజం లేదు..: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మధువని గార్డెన్లో బీజేపీ(Telangana BJP) నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తాను పోటీ చేయనని ప్రచారం చేస్తున్నారని.. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటున్నానని స్పష్టం చేశారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) పోటీ చేసే గజ్వేల్ స్థానంలో కూడా పోటీ చేయనున్నట్లు ఈటల వెల్లడించారు. పదవి అనేది ఒకరి సొత్తు కాదని.. ప్రజలు పెట్టే బిక్ష అని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే పదవులు వస్తాయని ఎమ్మెల్యే చెప్పారు. నియోజకవర్గ ప్రజలు కచ్చితంగా తననే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
BRS fires on Congress : 'కాంగ్రెస్ నేతలు బీసీలను కించపరుస్తున్నారు'
Rice Millers Association meet Gangula : "ఆంక్షలు అమలుచేయకుండా.. ఎఫ్‌సీఐ బియ్యం సేకరించాలి"