కరీంనగర్ జిల్లా మానకొండూరు చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొబ్బరికాయ కొట్టి శోభయాత్ర ప్రారంభించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా స్నేహభావంతో గణేశ్ నిమజ్జనం జరుపుకోవాలని రసమయి బాలకిషన్ సూచించారు. పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వైద్యసేవలు ఏర్పాటు చేశామన్నారు.
ఇవీ చూడండి: 21వేల మంది పోలీసులతో నిమజ్జనానికి భద్రత