రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలు మూసేయాలని ఆదేశాలు ఇవ్వడంతో విద్యార్థులు స్వస్థలాలకు పయనమయ్యారు. విద్యార్థుల రాకతో కరీంనగర్ బస్టాండ్ కిటకిటలాడింది. ప్రభుత్వ నిర్ణయంతో తాము స్వగ్రామాలకు వెళ్తున్నట్లు తెలిపారు.
ఆన్ లైన్ తరగతులు అర్థం కావని విద్యార్థులు చెబుతున్నారు. లాక్ డౌన్ సమయంలో నిర్వహించిన తరగతులతో అయోమయానికి గురైనట్లు వాపోతున్నారు. ప్రత్యక్ష బోధనతోనే పాఠాలు అర్థమవుతాయని విద్యార్థులు అంటున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.