మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ షామీర్‌పేటలోని తన నివాసం నుంచి భారీ కాన్వాయ్‌తో సోమవారం రాత్రి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చేరుకున్నారు. మహిళలు, యువత, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పట్టారు. హుజూరాబాద్ మండలం కాట్రపల్లితో పాటు హుజూరాబాద్‌లోని అంబేడ్కర్ కూడలి వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలను అలంకరించి నివాళులర్పించారు ఈటల.
అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. భారీ కాన్వాయ్‌తో ఈటల క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల అభిమానానికి చేతులెత్తి దండం పెడుతున్నానని మంత్రి ఈటల అన్నారు. అప్పటి కమలాపూర్ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు, హుజూరాబాద్ నియోజకవర్గంలో 12 సంవత్సరాల పాటు ప్రజా ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. వాళ్లతో చర్చించి నా భవిష్యత్ ప్రణాళిక వెల్లడిస్తామన్నారు. ఈటల పర్యటనతో ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: అ.ని.శా, విజిలెన్స్ చేతికి దేవరయంజాల్ భూముల విచారణ