కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గం కందుగులలో పోలింగ్ కేంద్రాన్ని ఈటల రాజేందర్ పరిశీలించారు. జడ్పీ పాఠశాలలో పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ తీరును పరిశీలించారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కమలాపూర్‌లోని పోలింగ్ కేంద్రం 262లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అధికార పార్టీ మద్యం ఏరులై పారిస్తోంది. మాకు డబ్బులు ఇవ్వలేదని ఓటర్లే ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడింది. పోలింగ్ రోజు కూడా డబ్బులు పంచుతున్నారు. ఈసీ కూడా డబ్బు పంపిణీని అడ్డుకోలేకపోతోంది. మంచి చెడు ఆలోచించుకునే సత్తా ప్రజలకు ఉంది.
-భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్
ఇదీ చూడండి: Huzurabad by election 2021: ప్రశాంతంగా కొనసాగుతున్న హూజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్..