First transgender gets loan in Telangana under PMEGP scheme : తెలంగాణలో మొట్టమొదటి సారిగా కరీంనగర్ జిల్లాలో ఓ ట్రాన్స్‌జెండర్‌కు స్వయం ఉపాధి కోసం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పథకం కింద రుణం మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఈ సందర్భంగా కర్ణన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలిసారిగా ట్రాన్స్ జెండర్‌కు స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటుకు రుణం మంజూరు చేయడం జరిగిందన్నారు. ఫొటో స్టూడియో కోసం రూ.5 లక్షల రుణం మంజూరు చేసినట్లు వెల్లడించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కరీంనగర్ శాఖ ద్వారా మంజూరు చేసినట్లు చెప్పారు.
అనంతరం ఇంకొక ట్రాన్స్ జెండర్ నక్క సింధుకు కూడా ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లా పరిషత్ సీఈఓ ప్రియాంక, జిల్లా లేటెస్ట్ మేనేజర్ ఆంజనేయులు, ఎస్బీఐ ఏజీఎం శేఖర్, జిల్లా పరిశ్రమ కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, పీడీ మెప్మా రవీందర్ బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.
వివరాలలోకి వెళ్తే: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని శాస్త్రినగర్‌కు చెందిన ఆశా కరీంనగర్‌కు వలస వచ్చి ఇక్కడే స్థిరపడింది. ఫోటోగ్రఫీపై మక్కువ ఉన్న ఆమె ఫోటోగ్రఫీ రంగాన్ని ఎంచుకుని 2017 నుంచి ఆదర్శనగర్‌లో ఫోటో స్టూడియోను నడుపుతోంది. ఫోటోగ్రఫీతో జీవనోపాధి పొందాలనే తనకు ఉన్న సామర్థ్యాలపై నమ్మకంతో ఈ రంగాన్ని ఎంచుకున్నట్లు ఆశా తెలిపారు.
ఆమె ఇతర ఫంక్షన్‌లను కవర్ చేయడంతో పాటు పుట్టినరోజు ఫంక్షన్‌లు, ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్‌లను క్లిక్ చేస్తోంది. అయినప్పటికీ, ఆర్థిక సమస్య ఉంది. అందుకే ఆమె పీఎంఈజీపీ కింద రుణం కోసం ఎంచుకుంది. వాటిని ఆమె తన స్టూడియోను అప్‌గ్రేడ్ చేయడానికి ఉపయోగించుకుంటుంది.
ఇవీ చదవండి: