ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జరిగే అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా కరీంనగర్లో అగ్నిమాపక సిబ్బంది అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో ప్రమాదాల నివారణ పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రమాదం జరిగితే తమని తాము ఎలా రక్షించుకోవాలో చేసి చూపించారు. విద్యార్థులు ఉత్సాహంగా ఈ వారోత్సవాల్లో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: నేడే ఇంటర్మీడియట్ ఫలితాలు