కరీంనగర్లో లాక్డౌన్ నియమాలు పాటించకపోతే ఇక జరిమానాలతో మోత మోగిస్తామంటున్నారు అధికారులు. నగరంలోని కాంచీట్ కూడలి వద్ద పండ్ల వ్యాపారులు లాక్డౌన్ నిబంధనలు పాటించలేదు. మాస్కులు లేకుండానే పండ్ల వ్యాపారం చేస్తున్నారు. భౌతిక దూరం కూడా పాటించలేదు.
నియమాలు పాటించకుండా వ్యాపారం చేస్తున్న ఐదుగురికి రూ.100 చొప్పున అధికారులు జరిమానా విధించారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ప్రజలను అధికారులు హెచ్చరించారు.