ఈ నెల 16న కరీంనగర్ జిల్లా శాలపల్లి ఇందిరానగర్‌లో సీఎం కేసీఆర్ సభ నిర్వహించనున్నారు. ఇందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలోనే కేసీఆర్.. దళిత బంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం బహిరంగ సభ ఏర్పాట్లపై సీఎస్ సోమేశ్ కుమార్ కరీంనగర్ కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. గ్రామసభల ద్వారా గ్రామాల్లో దళిత బంధు సాయం పంపిణీ సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. అర్హులైన దళితుంలదరికీ దళిత బంధు అందిస్తామని స్పష్టం చేశారు.
సీఎం సభ జనసమీకరణ కోసం ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించారు. బస్సుల్లో జనాలను తరలించేలా పంతుళ్లకు సూచనలు చేశారు. ఈ నెల 16న మధ్యాహ్నం 2 గంటలకు సమావేశానికి రావాలని కరీంనగర్ డీఈవో ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు కోసం ఎస్సీల ధర్నా