ETV Bharat / state

హుజూరాబాద్​ నేతలతో హరీశ్​ రావు భేటీ - ఈటల రాజేందర్​ తాజా వార్తలు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులతో మంత్రి హరీశ్​ రావు, ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ భేటీ అయ్యారు. తామంతా తెరాసతోనే ఉన్నామని.. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని కమలాపూర్ నాయకులు స్పష్టం చేశారు.

harish rao
హరీశ్​ రావు, హుజూరాబాద్​
author img

By

Published : May 22, 2021, 3:17 PM IST

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు, ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్.. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈటలను ఏకాకిని చేసేందుకు హుజురాబాద్ నియోజకవర్గంలోని ద్వితీయశ్రేణి నాయకులతో తెరాస నేతలు చర్చిస్తున్నారు. అందులో భాగంగా హరీశ్​ రావు, వినోద్ కుమార్ కమలాపూర్ నాయకులతో మాట్లాడారు. తొందరపడి భవిష్యత్తును దెబ్బతీసుకోవద్దని చెప్పారు.

కమలాపూర్ మండల పరిషత్ ప్రెసిడెంట్ తడక రాణీ శ్రీకాంత్, కమలాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఛైర్మన్ పేరాల సంపత్ రావు, కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్ పి. కృష్ణ ప్రసాద్, మండల రైతు బంధు అధ్యక్షులు శ్రీనివాస్, స్థానిక సీనియర్ నాయకుడు కుమారస్వామి మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. తామంతా తెరాసతోనే ఉన్నామని.. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని కమలాపూర్ నాయకులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: సీఎం ఆదేశాలతో రాష్ట్రంలో మరింత కఠినంగా లాక్​డౌన్​ అమలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.