రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టానికి మద్దతుగా కరీంనగర్‌లో రైతులు.. ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. గతంలో రిజిస్ట్రేషన్ల కోసం రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడినట్లు తెలిపారు. నూతన చట్టంతో ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతులను ఆదుకున్నారన్నారు.
నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి, కరీంనగర్ గ్రామీణ మండలాల నుంచి పెద్దఎత్తున రైతులు తరలివచ్చారు. సాలెహ నగర్ నుంచి నగరంలో కోర్టు చౌరస్తా, తెలంగాణ చౌక్, కమాన్ చౌరస్తా మీదుగా ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిందాబాద్.. కొత్త రెవెన్యూ చట్టం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
ఇవీచూడండి: టీఎస్ బీపాస్ అమలుకు టీఎస్ త్వరలో కార్యాచరణ: కేటీఆర్