కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంతోపాటు... రామడుగు మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రాస్తారోకో చేశారు. నెల రోజులుగా ఎదురు చూస్తున్నా అధికారులు స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. చొప్పదండి పట్టణంలో... కరీంనగర్-మంచిర్యాల రహదారిపై బైఠాయించారు. రైతుల నిరసనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని రైతులకు నచ్చజెప్పారు. రామడుగు మండలంలో రైతులతో చర్చించిన తహసీల్దార్ ఉన్నతాధికారులతో సంప్రదించి ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడం వల్ల రైతులు నిరసన విరమించారు.
ఇదీ చూడండి: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సుప్రీంకోర్టులో విచారణ