కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. వడ్లు కొనుగోలు చేయడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ.. రోడ్డుపై బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అధికార పార్టీ నాయకుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని.. తమ ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపించారు. ఎందుకు ధాన్యం కొనుగోలు చేయడంలేదని అడిగితే.. భాజపాకి ఓటు వేశారని అందుకే కొనడంలేదని అంటున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలులోనూ పార్టీలను చూసి కొనుగోలు చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అసలే రోజుల కొద్ది కల్లాల వద్ద ధాన్యం ఆరబోస్తే.. అవి కాస్తా మంచుతో తడిసిపోతున్నాయని వాపోయారు. మరోవైపు ధాన్యం కొనుగోలు చేయడానికి అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: Minister Errabelli : కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే వడ్లు కొనలేక పోతున్నాం: మంత్రి ఎర్రబెల్లి
Farmers Problems: పగలూ రాత్రి ధాన్యం కుప్పల వద్దే కర్షకుల కాపలా
paddy procurement in telangana: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. అన్నదాతల అవస్థలు
Grain purchase issue: పెరగని మిల్లింగ్ సామర్థ్యం.. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం
Harish Rao: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలి
ధాన్యం కుప్పపైనే ప్రాణాలొదిలిన రైతు.. కొనుగోలులో జాప్యమే కారణమా..?
Farmers Problems: ధాన్యం కొనడం లేదని రోడ్డెక్కిన అన్నదాత.. క్యూలైన్లో పడిగాపులు