కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో అకాల వర్షాలకు వ్యవసాయ మార్కెట్లోని తూకం వేసిన ధాన్యం తడిసిపోయింది. యాసంగిలో గంగాధర మండలంలో లక్ష 44 వేల క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. తూకం వేసిన అనంతరం రవాణ చేసేందుకు లారీలు అందుబాటులో లేకపోవడం వల్ల మార్కెట్ యార్డులోనే ధాన్యం నిల్వచేశారు. టార్ఫాలిన్లు వినియోగించపోవడం వల్ల ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిచిపోయాయి. మిల్లర్లు ధాన్యాన్ని తీసుకెళ్లే వరకు రైతులదే బాధ్యత కావడం వల్ల చెల్లింపుల్లో కోత పడనుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చూడండి: 'ఏంటయ్యా... వేసవి అయిపోయాక నీరిస్తారా?'