కరీంనగర్ జిల్లా చెంజర్లకు చెందిన రాజిరెడ్డి అనే రైతు మానకొండూరు మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరాహారదీక్ష చేపట్టాడు. తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వ భూమిని వేరే వాళ్ల పేరు మీద రిజిస్టర్ చేసి అధికారులు తనను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించాడు. రాజిరెడ్డికున్న ఐదెకరాల భూమిలో మూడున్నర ఎకరాలు ఆన్లైన్లో పొందుపరచగా... మరో ఎకరంన్నర కోసం మాత్రం అధికారులు కనికరించడంలేదని వాపోయాడు. గతంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షకు దిగగా ఎమ్మార్వో శ్రీనివాస్ హామీపై దీక్ష విరమించారు. ఇప్పటికీ పరిస్థితి కొలిక్కిరానందున మరోసారి నిరాహారదీక్షను తిరిగి ప్రారంభించారు.
ఇదీ చదవండిః శాసనసభ నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ