Faculty shortage in Satavahana University : శాతవాహన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి 15 ఏళ్లు గడిచినా..ఇప్పటి వరకు మంజూరైన పోస్టులు భర్తీచేయలేకపోయారు. అన్ని విభాగాల్లోను ఒప్పంద అతిధి ఆచార్యులే ఎక్కువగా ఉన్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక కొత్త కోర్సులను ప్రవేశపెట్టి ఉపాధి మార్గాలను పెంచాల్సి ఉండగా అది జరగకపోవడం విద్యార్ధులకు ఇబ్బందిగా మారింది. సమస్యలను పరిష్కరించాలని విద్యార్ది సంఘాలు ఆందోళన చేపట్టినా..పట్టించుకొనే వారు కరవయ్యారు.
Satavahana University Faculty shortage : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నత చదువు కోసం 2008లో ప్రభుత్వం శాతవాహన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. వర్సిటీ ప్రారంభించిన క్రమంలో 63మంది బోధన సిబ్బంది పోస్టులు మంజూరు చేస్తూ 22మందిని నియమించింది. ఆ తర్వాత ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియామకాలు పూర్తి చేయలేదు. పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వానికి విన్నవించే వారు లేకపోవడంతో నియమించిన అధ్యాపకులలో నుంచి ఆరుగురు పదవీ విరమణ చేశారు. పర్యవసానంగా ప్రస్తుతం 16మందితోనే విశ్వవిద్యాలయంలో విద్యార్ధులకు బోధనలు జరుగుతున్నాయి.
''తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి తొమ్మిది సంవత్సరాలైనా శాతవాహన విశ్వవిద్యాలయంలో అధ్యాపకులను నియమించలేక పోతుంది. 16 మందితోనే విశ్వవిద్యాలయంలో విద్యార్ధులకు బోధన జరుగుతోంది. ప్రశ్నించిన విద్యార్థులను పరీక్షల పేరుతో మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. విద్యాశాఖలో అధ్యాపకులను నియమించడం పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం జరుగుతుందని మేం తెలంగాణ సర్కార్‌ను ప్రశ్నిస్తున్నాం.'' - విద్యార్ధులు
Teacher shortage in Satavahana College : విశ్వవిద్యాలయంలో చాలా వరకు అన్ని విభాగాల్లోను ఒప్పంద అతిధి ఆచార్యులే ఎక్కువగా ఉన్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ చదువులోనే కాకుండా.. హాస్టళ్లలోనూ విద్యార్దులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. సరైన రక్షణ కరవైందంటున్నారు. అధ్యాపకుల నియామకాల్లోను అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు.
KTR at Nizam College Hyderabad : 'నేనిక్కడే చదువుకున్నా.. ఈ కాలేజ్‌తో ఎన్నో జ్ఞాపకాలున్నాయి'
''శాతవాహన యూనివర్శిటీ 2008లో ప్రారంభమైంది. 2009లో అధ్యాపకులను నియమించారు. అప్పుడు 11 మంది ఉండే వారు. 2013లో 11 మంది.. మొత్తం కలిసి 22 మంది అధ్యాపకులు ఉండేవారు. కొంత మంది రిటైర్డ్ అవ్వడంతో ప్రస్తుతానికి 16 మంది అధ్యాపకులు ఉన్నారు. బోధన సిబ్బంది కొరత గురించి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడూ వివరణ ఇస్తున్నాం.'' - ఆచార్య మల్లేశం, శాతవాహన వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్
మారుతున్న కాలంతో పాటు విద్యార్దుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త కోర్సులను ప్రవేశపెట్టి ఉపాధి మార్గాలను పెంచాల్సి ఉండగా వర్సిటీ అధికారులు మాత్రం ఉన్న కోర్సులనే సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సులుగా మార్చి విద్యార్దుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బోధన సిబ్బంది కొరత గురించి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడూ విన్నవిస్తున్నట్లు వైస్ చాన్స్‌లర్ మల్లేశం చెబుతున్నారు. విద్యార్థులు అవసరాలు.. మారుతున్న కాలంతో పాటు కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టడమే కాకుండా.. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో బోధనా సిబ్బందిని నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు.
Prathidwani : విశ్వవిద్యాలయాలు.. వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయా?