ETV Bharat / state

EETELA RAJENDER: ప్రలోభాలతో హుజూరాబాద్ ప్రజలను కొనలేరు: ఈటల

తెరాస ప్రలోభాల పట్ల హుజూరాబాద్ (Huzurabad By Election)ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈటల రాజేందర్(EX minister eetela rajender) కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో డబ్బు సంచులతో ఓట్లను కొనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఉప ఎన్నికలో గెలిచేందుకు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని విమర్శించారు.

EX minister eetela rajender
హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో ఈటల
author img

By

Published : Sep 28, 2021, 8:14 PM IST

హుజూరాబాద్ ఉపఎన్నికలో(Huzurabad By Election)ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో తెరాస నాయకులు డబ్బు సంచులతో వస్తారని మాజీమంత్రి ఈటల రాజేందర్(EX minister eetela rajender)ఆరోపించారు. తెరాస ప్రలోభాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్​లోని మధువని గార్డెన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

దొంగ ఓట్ల కార్యక్రమం మొదలైంది

హుజూరాబాద్​ ప్రజలు కుట్రలు, కుతంత్రాలను చేధించగలరని ఈటల అన్నారు. నా ప్రజలు డబ్బు సంచులు, మద్యం సీసాలకు అమ్ముడుపోయే వారు కాదన్నారు. వరంగల్​లో గెలిచినట్లుగా ఇక్కడ కూడా దొంగ ఓట్లతో గెలవాలనుకుంటే కుదరదని ఈటల విమర్శించారు. హుజూరాబాద్, జమ్మికుంటలో దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం మొదలైందని ఆరోపించారు. తెరాస నాయకులు మీకు తెలియకుండానే ఓట్లు నమోదు చేస్తారని.. వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హుజూరాబాద్​ ఉపఎన్నికలో తెరాసకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం ముఖ్యమంత్రి పర్యవేక్షణలో అధికారులు, మంత్రులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇవాళ అక్రమంగా సంపాందించిన డబ్బు సంచులతో ఓట్లకు విలువకట్టే ప్రయత్నం చేస్తరు. దీనిపట్ల అందరూ అప్రమత్తంగా ఉండమని కోరుతున్నా. చివరికి దొంగ ఓట్లు వేసే కార్యక్రమం కూడా హుజూరాబాద్, జమ్మికుంటలో జరుగుతా ఉంది. వరంగల్​లో దొంగ ఓట్లతో గెలిచినట్టుగా హుజూరాబాద్​లో గెలుస్తామనుకుంటే​ చెల్లదు. నా హుజూరాబాద్ చాలా చైతన్యవంతమైన గడ్డ. నా హుజూరాబాద్ కుట్రలు, కుతంత్రాలను చేధించగలదు. ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకు తెలియకుండానే మీ పేర్లమీద దొంగనోట్లు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని కోరుతున్నా. నా హుజూరాబాద్​ ప్రజల్ని డబ్బులతో, మద్యం సీసాలతో, కుట్రలతో, కుతంత్రాలతో బెదిరించాలని చూస్తే మాత్రం సరైన గుణపాఠం చెబుతారని నేను హెచ్చరిస్తున్నా. - ఈటల రాజేందర్, మాజీ మంత్రి

ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజూరాబాద్​ ఉపఎన్నిక(Huzurabad By Election 2021) షెడ్యూల్ ఎట్టకేలకు వచ్చేసింది. ఉపఎన్నికకు అక్టోబర్ 2న నోటిఫికేషన్​ ఇవ్వనున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అక్టోబర్ 8 వరకు నామినేషన్ల స్వీకరణ, 11న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరపనున్నట్లు తెలిపింది. వాటి ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు విధించింది. అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad By Election Polling 2021) పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరపనున్నట్లు తెలిపింది.

ఉపఎన్నికపై ఈటల రాజేందర్

ఇదీ చూడండి: Election Notification 2021 : హుజూరాబాద్​, బద్వేల్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.