ETV Bharat / state

కరోనా పాజిటివ్​ ఉన్న వ్యక్తి సమాచారం ఎలా వస్తోంది?

author img

By

Published : Jul 11, 2020, 5:24 PM IST

గ్రామీణ ప్రాంతాల్లో కరోనా ఉద్ధృతంగా పెరుగుతున్న క్రమంలో వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే మార్గమని కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాదికారి డాక్టర్ సుజాత అన్నారు. ఇప్పటి వరకు జిల్లా 216 కరోనా కేసులు గుర్తించినప్పటికి 127 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపారు. దాదాపు 90 మంది హోం ఐసోలేషన్‌లోనే చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ప్రతిరోజు 80 నుంచి 100 వరకు నమూనాలు సేకరిస్తున్నామని.. మరో రెండు రోజుల్లో ట్రూనాట్ పద్ధతి ద్వారా కరీంనగర్​లో‌ కరోనా పరీక్షలు ప్రారంభిస్తామంటున్న డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుజాతతో మా ఈటీవీ భారత్​ ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి..

etv-bharat-interview-with-dmho-dr-sujata
కరోనా పాజిటివ్​ ఉన్న వ్యక్తి సమాచారం ఎలా వస్తోంది?
కరోనా పాజిటివ్​ ఉన్న వ్యక్తి సమాచారం అధికారులకు ఎలా వస్తోందంటే..?

జిల్లాలో ఇప్పటి వరకు 216 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి కదా..? ఇప్పుడు ఎన్ని యాక్టివ్ కేసులు ఉన్నాయి..? వారికి ఎలాంటి చికిత్స అందిస్తున్నారు..?

ఇండోనేషియన్​లతో కలుపుకుంటే ఇప్పటి వరకు 216 కేసులు జిల్లాలో వచ్చాయి. ఇందులో ప్రస్తుతం 127 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. చాలా మందికి ఎలాంటి లక్షణాలు లేవు కాబట్టి ఇళ్ల వద్దనే ఉంచి వారి చికిత్స అందిస్తున్నాము. నలుగురు స్థానిక ప్రభుత్వాసుపత్రిలోను మరికొంత మంది.. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి అందించే అంశంలో ఇంట్లో వారికి మార్గదర్శకాలు వివరిస్తున్నాము.

మీరు ఇప్పటి వరకు 216 కేసులను గమనించారు కదా... వారికి వైరస్ ఎలా సోకింది..?

లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తర్వాత ప్రయాణాలు బాగా పెరిగాయి.. వివిధ పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే వైరస్ సోకుతోంది. అత్యవసరమై ఆసుపత్రులకు వెళ్లినప్పుడు కూడా వూరస్ సోకుతున్నట్లు గమనించాము. అందుకే అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని.. 60ఏళ్లపైబడి వయస్సు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దని జాగ్రత్తలు చెబుతున్నాము.

మీకు ముందు పాజిటివ్‌ ఉన్న వ్యక్తికి సంబంధించిన సమాచారం ఎలా వస్తోంది..? వారి నమూనాలు ఎలా సేకరిస్తున్నారు..?

ఒక వ్యక్తికి సంబంధించి ఎక్కడ పరీక్ష జరిగినా పాజిటివ్‌ వచ్చినప్పుడు దానికి సంబంధించి అలెర్ట్‌ మాకు వస్తుంది. దానితో వారి ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహించడం ప్రైమరీ కాంటాక్టుల వివరాలు సేకరిస్తున్నాము. అందులో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే నమూనాలు సేకరించి వారిని హోం క్వారంటైన్‌ లేదా ఐసోలేషన్‌లో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాము.

జిల్లాలో అధికంగా ఎక్కువ కేసులు ఏ ప్రాంతంలో ఉన్నాయి..?

మొదట్లో హుజూరాబాద్‌ ప్రాంతంలో ఎక్కువగా వచ్చినా క్రమంగా జిల్లాలో అన్ని ప్రాంతాల్లో బయట పడుతున్నాయి. నగరంలోనే 28 కేసులు ఉన్నాయి. అయితే ఒక కేసు బయట పడితే.. సాధ్యమైనంత వరకు వారి ఇంట్లో వారికే అధికంగా వస్తున్నాయి.

రోజు ఎన్ని నమూనాలు సేకరిస్తున్నారు..? ఫలితాలు ఎలా వస్తున్నాయి..?

ప్రతిరోజు 50కు పైగా నమూనాలు సేకరిస్తున్నాము. ఇప్పటి వరకు జిల్లాలో 1900 నమూనాలు పరీక్షలు జరిపితే 243 మందికి పాజిటివ్‌గా తేలాయి. అంతేకాకుండా ఐఎల్‌ఐ కేసులు నమూనాలు వెంటనే సేకరించి పంపుతున్నాము.

కరీంనగర్‌లో ప్రైవేటు మెడికల్ కళాశాల చల్మెడతో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి కదా..? ప్రభుత్వ ఆసుపత్రిలో ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి.?

ఇప్పటికైతే నమూనాలు సేకరించి హైదరాబాద్ లేదా.. వరంగల్ పంపిస్తున్నాము. ట్రూనాట్ సౌకర్యం కూడా కరీంనగర్‌లో అందుబాటులోకి వచ్చింది.

ప్రధానంగా అత్యవసర సమయాల్లో బయటికి వెళ్లినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

అత్యవసర సమయాల్లో బయటికి వెళ్లినప్పుడు విధిగా మాస్కులు ధరించాలి. మాస్కును తాకకూడదు. పదేపదే ముఖం వద్దకు చేతులను తీసుకెళ్ల కూడదు. భౌతిక దూరం తప్పకుండా పాటిస్తే కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.

పదే పదే భౌతిక దూరం పాటించమని ఎందుకు అనాల్సి వస్తోంది..?

ఎలాంటి లక్షణాలు లేని వ్యక్తి ద్వారా కూడా వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుంది. అందు వల్ల కనీసం ఒక మీటర్ దూరంలో ఉంటే అతని ద్వారా వెలువడే తుంపర్లు మన మీద పడే అవకాశం ఉండదు కాబట్టి విధిగా భౌతిక దూరం పాటించాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.