Etela on Dalithabandhu: రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు పథకం అమలు చేస్తున్నామని గొప్పగా ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి అడుగు మాత్రం గడప దాటడం లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. ఉప ఎన్నికలు రావడంతోనే దళితులు గుర్తుకొచ్చారని.. ఆ తర్వాత శ్రద్ధ తగ్గిపోయిందని దుయ్యబట్టారు. దళిత బంధు పథకంలో లబ్ధిదారులు కోరుకొనే పథకాలు అమలు చేయాల్సింది పోయి బలవంతంగా పాడిగేదెలు అంటగట్టేయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల సందర్భంలో ఈ పథకాన్ని కేవలం నవంబర్ 4వరకు మాత్రమే ఆపగలుగుతారని ఆ తర్వాత తానే స్వయంగా అమలు చేస్తానని సీఎం గొప్పలు చెప్పారని విమర్శించారు. ఇప్పటికి ఎన్నికలు పూర్తయి మూడు నెలలు గడిచిపోయినా కనీసం 800మందికి కూడా పథకం అమలు చేయలేక పోయారని ధ్వజమెత్తారు. అధికారులు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని.. రాజకీయ నాయకులు చెప్పినట్లు నడుచుకోవడం ఏ మాత్రం సరైన పద్ధతి కాదని ఈటల రాజేందర్ దుయ్యబట్టారు.
దళిత బంధు పథకం ద్వార ఇచ్చే పది లక్షల రూపాయల మీద కలెక్టర్లతో పాటు బ్యాంకుల పెత్తనం ఉండొద్దు. పది లక్షల రూపాయలు ఏం చేసుకోవాలో ఆ దళితుల ఇష్టం. దళిత బంధు పథకంలో లబ్దిదారులు కోరుకొనే పథకాలు అమలు చేయాల్సింది పోయి బలవంతంగా పాడిగేదెలు అంటగట్టేయత్నం చేస్తున్నారు.
-ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే
ఇదీ చదవండి: