రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు తనపై పోటీ చేయాలని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల (Etela) రాజేందర్ సవాల్ విసిరారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా.. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల హృదయాల్లో తనకు స్థానం ఉందని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూరులో ఆయన పర్యటించారు. గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్థులు భాజపా (bjp)లో చేరగా.. పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే నియోజకవర్గంలో తెరాస వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందని ఈటల రాజేందర్ విమర్శించారు. పది లక్షల చొప్పున దళితబంధు ఇచ్చినా.. గొల్ల, కురుమలకు గొర్రెలు పంపిణీ చేసినా.. కులాల వారీగా దావత్‌లు ఇచ్చినా.. ఊర్లకు ఊర్లను బార్లుగా మార్చినా.. రూ.20 వేల చొప్పున ఓట్లను కొన్నా.. నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఉన్న బిడ్డ ఈటల రాజేందర్ అన్నారు. ధర్మం ఏందో.. అధర్మం ఏందో, న్యాయం ఏందో.. అన్యాయం ఏందో, పని చేసేవాడెవడో.. పని దొంగ ఎవడో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. దీనిని బట్టే ఓట్లేస్తరు.. ఎవరో చెప్పినంత మాత్రాన వెయ్యరంటూ దుయ్యబట్టారు.
నన్ను ఓడించేందుకు ఐదుగురు మంత్రులు పని చేస్తున్నారని ఈటల (etela rajender) ఆరోపించారు. దమ్ముంటే ధైర్యంగా ముందుకు రావాలని.. మేమేం చేశామో, మీరేం చేశారో చెప్పుకోవాలి గానీ.. పిచ్చిపిచ్చి పనులు చేయొద్దంటూ హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr)కు దళితులపై ప్రేమ లేదని, వారి ఓట్లపై మాత్రమే ప్రేముందని అన్నారు. ఓట్ల కోసం తెరాస నేతలు ఏమిచ్చినా తీసుకోండి.. భాజపాకు ఓటేయండి అని ఆయన విజ్ఞప్తి చేశారు.
వస్తవా రా హరీశ్‌రావు, వస్తవా రా కేసీఆర్.. ఇక్కడ పోటీ చేద్దాం. ఈటల దిక్కులేని వాడని నువ్వనుకుంటున్నవ్. గుర్తుబెట్టుకో నేను దిక్కులేని వాడిని కాదు.. ఈ హుజూరాబాద్ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నవాడిని. ఓడిపోతామనే భయంతో పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నారు. నన్ను బొండిగ పిసికే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను కాపాడుకుంటరా.. చంపుకుంటరా అది మీ చేతుల్లో ఉంది.-ఈటల రాజేందర్, భాజపా నేత
ETELA: 'తెరాస నాయకులు ఎన్ని పైసలిచ్చినా తీసుకోండి.. అవన్నీ మనయే'
Etela Rajender: 'ఉద్యమకారులను రాళ్లతో కొట్టిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చారు'
BANDI SANJAY: 'దళిత బంధు తరహా పథకం రాష్ట్రమంతా అమలు చేయాలి'
Etela: 'కేసీఆర్ చేసిన అవమానాలు భరించలేకే ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు'