కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలో ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్లిన వరికోలు నర్సమ్మ వడదెబ్బతో మృతి చెందింది. మధ్యాహ్నం వేళ ఉపాధి పని ముగించుకొని ఇంటికి వస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా వాంతులు చేసుకుని పడిపోయింది. తోటి కూలీలు చికిత్సకు తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించారు. మృతురాలి కుటుంబాన్ని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరామర్శించారు. తోటి కూలీ మరణించటం వల్ల గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి - Employment Guarantee Worker dies Due to Sunstroke
ఉపాధి హామీ పథకంలో కూలీ పనులకు వెళ్లి కరీంనగర్ జిల్లా ఆర్నకొండ గ్రామంలో మహిళ మృతి చెందింది. తోటి కూలీ మృతి చెందటం వల్ల గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
వడదెబ్బతో కూలీ మృతి