కరీంనగర్ జిల్లాలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ క్రికెట్ పోటీలు హోరా హోరీగా సాగుతున్నాయి. సీనియర్స్ విభాగంలో సెమీ ఫైనల్స్ ఆసక్తికరంగా జరిగాయి. కోరుట్ల శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాలపై మంథని జేఎంటీయూ జట్టు విజయం సాధించింది. పెద్దపల్లి ట్రినిటి డిగ్రీ కళాశాలపై ఎల్ఎండీ శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాల జట్టు గెలుపొందింది. ఎల్ఎండీ శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలపై మంథని జేఎన్టీయూ జట్టు విజేతగా నిలిచింది.
నగునూర్ ప్రతిమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పై నిగమా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విజయం సాధించింది. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ పై వివేకానంద డిగ్రీ పీజీ జట్టు గెలుపొందింది. సిరిసిల్ల హంస వాహిణి డిగ్రీ కళాశాలపై కరీంనగర్ నిగమా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్టు విజయం సాధించింది. నిగమా జట్టుకు చెందిన బ్యాట్స్ మెన్ రాజు 27 బంతుల్లో 62 పరుగులు... ఆరు సిక్సులతో మంచి ప్రతిభ కనబరిచాడు.
ఇవీ చూడండి: కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు