ETV Bharat / state

'లాక్​డౌన్​లో పనిచేసిన లెక్చరర్లకు జీతాలివ్వాలి'

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధించినా జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్లందరికీ జీతాలివ్వాలని కోరుతూ కరీంనగర్​ డీఈవోకు డీవైఎఫ్​ఐ నేతలు వినతిపత్రం అందజేశారు.

dyfi protest at deo office in karimnagar
'లాక్​డౌన్​లో పనిచేసిన లెక్చరర్లకు జీతాలివ్వాలి'
author img

By

Published : Jul 3, 2020, 6:55 PM IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో జూనియర్​ కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్లు అందరికీ జీతాలివ్వాలని డీవైఎఫ్ఐ కరీంనగర్​ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశారు. డీఈవో కార్యాలయంలో డీఈవో రాజ్యలక్ష్మికి డీవైఎఫ్​ఐ నేతలు వినతిపత్రం సమర్పించారు.

పది- ఇరవై ఏళ్ల నుంచి కళాశాలలనే నమ్ముకుని విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు ఇప్పించేలా చూడాలని డీఈవోను కోరారు. లాక్​డౌన్​ కాలంలో ప్రైవేట్​ కళాశాల యాజమాన్యాలు.. కొందరు లెక్చరర్లను తీసివేసిందని... వారందరినీ తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని కోరారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.