కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలోని ఓ వైన్స్లో శ్రీనివాస్ అనే వ్యక్తి బీరును కొనుగోలు చేశాడు. షాప్ దగ్గరే బీరును అటు ఇటు తిప్పి చూశాడు. లోపల చెత్త కనిపించడం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. కోపంతో యజమాని దగ్గరకు వెళ్లిం ఏంటిదని నిలదీశాడు. 'మాకేం తెలీదు... బీరు సీసా మీద టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. దానికి ఫోన్ చేసి చెప్పండంటూ' యజమాని తెలిపాడు. మద్యంలో ఇలాంటి చెత్తా చెదారం వస్తే...ఆరోగ్యం ఏం కావాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించి ఇలాంటి బీర్లు తయారు చేసే కంపెనీలపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ డిమాండ్ చేశాడు.
ఇవీ చూడండి: కిడ్నాప్ చేసి ఎంపీటీసీని హతమార్చిన మావోలు