ETV Bharat / state

వాటర్ కోసం వెళ్తే లక్షలు మాయం - కరీంనగర్ బస్టాండ్

కరీంనగర్ బస్టాండ్ ప్రాంగణంలో దొంగతనం జరిగింది. మంచిర్యాల నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో  రెండు లక్షల 25 వేల రూపాయలు చోరీ చేశారు. దీనికి సంబంధించిన సీసీ వీడియో పుటేజ్​ను పోలీసులు విడుదల చేశారు.

వాటర్ కోసం వెళ్తే లక్షలు మాయం
author img

By

Published : May 1, 2019, 7:17 PM IST

కరీంనగర్ బస్టాండ్ ప్రాంగణంలో ఒక బస్సులో ప్రయాణికుడి నుంచి రెండు లక్షల 25 వేల రూపాయలు చోరీ చేశారు. అపహరించుకుని వెళ్తున్న ఓ వ్యక్తికి సంబంధించిన సీసీ ఫుటేజ్​ను పోలీసులు విడుదల చేశారు. మంగళవారం కొలిపాక రాజేందర్ మంచిర్యాల నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు బస్సెక్కాడు. తన బ్యాగులో రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టుకున్నాడు. కరీంనగర్ బస్టాండ్​కు రాగానే బ్యాగును సీట్లో పెట్టి వాటర్ బాటిల్ కొనేందుకు కిందికి దిగాడు. వచ్చేసరికి బ్యాగులో ఉన్న డబ్బులు మాయమయ్యాయి. దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బస్టాండ్​లోని సీసీ కెమెరాల ద్వారా నిందితుడికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. దొంగను త్వరలో పట్టుకుంటామని పోలీసులు భరోసానిచ్చారు.

వాటర్ కోసం వెళ్తే లక్షలు మాయం

ఇవీ చూడండి: యాదాద్రి జిల్లాలో రక్తసిక్తం..నలుగురు దుర్మరణం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.