కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం జాగీర్‌పల్లికి చెందిన వనిత అనే మహిళ గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుంది. పలు ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ చికిత్స కోసం తిరిగింది. ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. ఇందుకు సుమారు రూ.2లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. వనిత ఆర్థికస్థోమత అంతంతమాత్రంగా ఉండటంతో ఆపరేషన్ చేయించుకొనేందుకు ముందుకు రాలేదు.
ఈ నెల 28న వనిత హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి కడుపునొప్పితో వచ్చింది. ఆసుపత్రిలో ఆర్‌ఎంఓ శ్రీకాంత్‌రెడ్డి పరీక్షలు నిర్వహించారు. కడుపులో పెద్ద సైజులో కణతి ఉన్నట్లుగా గుర్తించారు. దానిని 'ఓవరాన్ సిస్ట్"గా పేర్కొన్నారు. గురువారం శ్రీకాంత్‌రెడ్డి వైద్య బృందం ఆ మహిళకు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. వనిత కడుపులో ఉన్న ఆరు కిలోల బరువు గల కణతిని తొలగించారు. వనిత ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు ఆర్‌ఎంఓ స్పష్టంచేశారు.