కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించే రోజువారి కొవిడ్ పరీక్షలు పెంచనున్నట్లు జిల్లా వైద్యాధికారి డా. సుజాత తెలిపారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్, తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అక్కడ కొవిడ్ పరీక్షలు చేస్తున్న తీరును పరిశీలించారు. మహమ్మారి అనుమానితులు.. చుట్టుప్రక్కల వారు ఏమనుకుంటారో అని సందేహించకుండా దగ్గరల్లోని ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు.
కౌన్సిలింగ్ నిర్వహించి..
వైద్యాధికారులు, సిబ్బందికి కరోనా పరీక్షల నిర్వాహణపై ఆమె పలు సూచనలు చేశారు. పరీక్షలు చేసుకున్నవారి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సిబ్బందిని అదేశించారు. పాజిటివ్ వచ్చినవారికి కౌన్సిలింగ్ నిర్వహించి.. మెడిసిన్ కిట్లు అందించాలన్నారు. హొమ్ ఐసోలేషన్లో ఉండే వారికి కొవిడ్ నిబంధనలు వివరించాలని, ప్రైమరీ కాంటాక్టులను వెంటనే గుర్తించాలని ఆమె అదేశించారు.
![district health officer inspect primary health care centre in karimnagar town](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-krn-01-23-kovidtestingcentersinspection-img-3038228_23082020081819_2308f_1598150899_820.jpeg)