కరీంనగర్ -హైదరాబాద్ రాజీవ్ రహదారిలో దిగువ మానేరు జలాశయం వద్ద సాయంత్రం వేళల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జిపై వర్షం కురిసినట్లుగా కీటకాలు వచ్చిపడడుతుండటంతో హెల్మెట్ లేనిది ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేని పరిస్థితి చోటు చేసుకుంటోంది.
పురుగుల విషయం తెలియక వేగంగా వచ్చిన వాహనదారులు జారి పడిపోతున్నారు. ఇక్కడ జరిగే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్ రెడ్డిలు కీటకాలు ఏ జాతికి చెందినవో నమూనాలు సేకరించాలని వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో నమూనా సేకరించి ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి వాసిరెడ్డి శ్రీధర్ చెప్పారు. ప్రాథమికంగా క్యాడిస్ ఫ్లై గా గుర్తించినట్లు తెలిపారు. నీటి ప్రవాహాల వద్ద ఈ కీటకాలు కనిపిస్తాయని వివరించారు. లైట్ ట్రాప్ విధానం లేదా మరో ప్రత్యామ్నాయం ద్వారా తగు చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి: విజయన్ చరిత్ర సృష్టిస్తారా?