కరీంనగర్ ఆర్టీసీ డిపోలో కార్మికులకు నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ మజ్జిగ పంపిణీ చేశారు. ఓ పక్క కరోనా భయం.. మరోపక్క మండుటెండను సైతం లెక్క చేయకుండా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడమే లక్షంగా పనిచేస్తున్న ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో.. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని రవీందర్ సింగ్ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు పాటిస్తూ.. మాస్క్ విధిగా ధరించాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రైతులు నియంత్రిత పద్ధతిలో సాగుకు ముందుకు రావాలి: సీఎం