ETV Bharat / state

జమ్మికుంట సీఐ సృజన్​రెడ్డిని అభినందించిన డీజీపీ

author img

By

Published : Jan 29, 2021, 10:22 PM IST

జమ్మికుంట సీఐ సృజన్​రెడ్డిని డీజీపీ మహేందర్​ రెడ్డి అభినందించారు. దేశంలోనే అత్యుత్తుమ పీఎస్​లలో 10వ స్థానంలో నిలిచేందుకు కృషి చేసిన పోలీసు సిబ్బందిని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.

జమ్మికుంట సీఐ సృజన్​రెడ్డిని అభినందించిన డీజీపీ
జమ్మికుంట సీఐ సృజన్​రెడ్డిని అభినందించిన డీజీపీ

దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో 10వ స్థానంలో నిలిచిన కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జమ్మికుంట పీఎస్​ సీఐ సృజన్ రెడ్డిని డీజీపీ మహేందర్​ రెడ్డి అభినందించారు. డీజీపీ కార్యాలయంలో సృజన్​రెడ్డిని శాలువాతో సత్కరించి నగదు బహుమతిని అందజేశారు. ఉత్తమ పోలీస్ స్టేషన్​గా ఎంపికవడంలో కృషి చేసిన వారిని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా రెండేళ్లు రెండు పోలీస్ స్టేషన్లు మొదటి పది ఉత్తమ స్టేషన్ల జాబితాలో నిలవడం పట్ల కమిషనర్ కమలాసన్ రెడ్డిని అభినందించారు. ఈ సందర్భగా చొప్పదండి, జమ్మికుంట పీఎస్​లో పని చేసే హోమ్ గార్డ్ నుంచి ఉన్నతాధికారులందరికి నగదు పురస్కారాన్ని అందచేస్తున్నట్టు డీజీపీ ప్రకటించారు.

జమ్మికుంట సీఐ సృజన్​రెడ్డి ఇటీవల రాష్ట్రపతి పతకం జీవన్​ రక్షా మెడల్​ను పొందారు. జమ్మికుంట పీఎస్​ పరిధిలోని మడిపల్లి గ్రామంలో బావిలో పడి ప్రాణాపాయస్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తులను తన ప్రాణాలను లెక్కచేయకుండా సీఐ సృజన్ రెడ్డి కాపాడారు. వారిని రక్షించినందుకు గుర్తింపుగా ఈ రాష్ట్రపతి మెడల్ లభించింది.

ఇదీ చదవండి: పోలీసులు, పరిశ్రమలకు వారధిగా ఎస్సీఎస్సీ: హోం మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.