కేసుల పరిష్కారం కోసం కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు తీసుకుంటున్న చర్యలను డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు. స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసుల స్థితిగతులపై వివిధ కమిషనరేట్లు, జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులతో సమీక్షించారు.
పెండింగ్ కేసులు... పరిమితికి లోపు కరీంనగర్ కమిషనరేట్‌లోనే ఉన్నాయని... వాటి పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన చోట్ల కూడా ఇదే విధానం అమలుచేస్తే పెండింగ్ కేసులు భారాన్ని తగ్గించవచ్చని సూచించారు. కార్యక్రమంలో డీజీ స్థాయి అధికారులు జితేందర్, గోవింద్ సింగ్, సందీప్ శాండీల్యాల తదితరులు పాల్గొన్నారు.