National Highway 563 Latest News : జాతీయ రహదారి ఎన్‌హెచ్– 563 (National Highway 563) పనుల్లో భాగంగా.. వరంగల్– కరీంనగర్ సెక్షన్‌లో భారీ చెట్ల తొలగింపు ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే దాదాపుగా దశాబ్దాల నాడు నాటిన వృక్షాలను కూకటివేళ్లతో సహా తొలగిస్తున్నారు. కరెంట్ రంపాలతో వందేళ్లనాటి చెట్లు సైతం క్షణాల్లో నేలకూలుతున్నాయి. రోడ్డు విస్తరణ కోసం వీటిని తొలగించాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తొలగింపు కాంట్రాక్టు తీసుకున్న ఓ సంస్థ నరికివేత కార్యక్రమాన్ని వేగం చేసింది. దీంతో ఈ రహదారిపై ఎక్కడ చూసినా విరిగిన కొమ్మలు, నేలకూలిన వృక్షాలు, రంపపు పొట్టు, నరికిన మొద్దులు, కర్రదుంగలు దర్శనమిస్తున్నాయి.
New roads in Telangana : దాదాపు ఈ రహదారిలో (Warangal Karimnagar National Highway) 2,000లకు పైగా దశాబ్దాలనాటి చెట్లు కూల్చక తప్పని పరిస్థితులు ఏర్పడటంతో.. పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌హెచ్ 563 కోసం తాము కూలుస్తున్న ఈ చెట్ల స్థానంలో తిరిగి మొక్కలు నాటుతామని.. పూర్వం స్థాయిలో పచ్చదనాన్ని పునరుద్ధరిస్తామని జాతీయ రహదారి విభాగం అధికారులు తెలిపారు.
వందల ఏళ్ల చెట్లు తొలగించారు... మళ్లీ నాటారు.. ఎలాగంటే!
మరోవైపు మానకొండూరు నుంచి హనుమకొండ శివారులో ఉన్న పలవేల్పుల వరకు.. 68 కిలోమీటర్ల నాలుగు వరుసల రహదారి నిర్వహణ బాధ్యతలను భోపాల్‌కు చెందిన సంస్థకు అప్పగించారు. భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తికాగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పనులు ప్రారంభించింది. జులై 20, 2025 లోపు పనులు పూర్తి చేసే విధంగా పనులు చేపడుతున్నారు.
భగీరథ పైప్‌లైన్ కోసం హరిత హారం చెట్లు తొలగించారు..
కరీంనగర్–జగిత్యాల హైవే రహదారి నిర్మాణం కోసం కూడా.. భూసేకరణ ప్రక్రియ, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. ఈ రహదారిలో 11 బ్రిడ్జిలు రూపుదిద్దుకోనున్నాయి. మొత్తం 68 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి నిర్మాణానికి.. గతేడాది దాదాపు రూ.1,491 కోట్లతో అంచనాలు రూపొందించారు. అయితే గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నో రహదారుల నిర్మించిన క్రమంలో.. తొలగించిన చెట్ల స్థానంలో మొక్కలు నాటే కార్యక్రమం మాత్రం జరగలేదు. ప్రస్తుత పరిస్థితిలో ముందుగా మొక్కలు నాటే ప్రక్రియ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
"కరీంనగర్- వరంగల్ మార్గంలో చెట్లన్ని తొలగిపోతున్నాయి. దాదాపు 100 సంవత్సరాలకు పైగా ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. గతంలో నాలుగు రహదారుల విస్తరణలో చెట్లను తొలగించారు. కానీ అక్కడ కొత్త మొక్కలు నాటలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాత చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటాలని కోరుతున్నాం." - నలుమాల వేణుగోపాల్, సామాజిక కార్యకర్త, కరీంనగర్ జిల్లా
కరీంనగర్–వరంగల్ మార్గంలో వేలాది వృక్షాలు నేలమట్టం కాగా.. మరిన్ని చేసే పరిస్థితి ఉందని.. వృక్షశాస్త్ర నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల వంటి విపత్తులను ఎదుర్కోవడానికి చెట్లు ఎన్నోరకాల సహకరిస్తుంటాయని సూచిస్తున్నారు. ఈ రహదారులకు ఇరువైపులా ఉన్న వృక్షాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. ఏళ్లనాటి వృక్షాలు నేలకొరుగుతున్న దృష్ట్యా ఆ స్థాయికి కొత్త మొక్కలు ఎదగాలంటే దశాబ్దాలు పడుతుందని చెబుతున్నారు. వీటిని నరికివేసే కంటే ఆధునిక ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్ పద్ధతులు అవలంబించి ఈ చెట్లను తరలించే అవకాశం ఉందని అంటున్నారు.
"జాతీయ రహదారి 563 విస్తరణలో భాగంగా వేలాది వృక్షాలను తొలగిస్తున్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటిన వృక్షాలను తొలగిస్తున్నారు. ఇది పర్యావరణానికి పెనుముప్పుగా మారుతుంది. తొలగించిన చెట్లను ట్రాన్స్‌లోకేషన్ ద్వారా వేరే చోట నాటాలని కోరుతున్నాం." - డాక్టర్ నరసింహమూర్తి, సహాయ ఆచార్యులు, శాతవాహన విశ్వవిద్యాలయం కరీంనగర్
మారుతున్న కాలానికి అనుగుణంగా రహదారుల విస్తరణలో.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆధునిక సాంకేతిక పద్ధతులు అవలంభించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. చెట్లను నరికివేసే కంటే ట్రాన్స్‌లొకేషన్ పద్ధతిలో మరోచోటుకు తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
వృక్షాలను రక్షించిన ఎన్ఆర్ఐ.. అదెలా అనుకుంటున్నారా?
Sandalwood Trees Theft in Nehru Zoo Park : నెహ్రూ జూపార్కులో గంధపు చెట్ల చోరీ