కరీంనగర్ కలెక్టరేట్ వద్ద సీపీఐ, సీపీఎం కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కూనంనేని సాంబశివరావు చేస్తున్న నిరవధిక దీక్షకు సంఘీభావం తెలిపారు. కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరిని తప్పు బట్టారు. సమస్యలు పరిష్కరించకపోవడం వల్లే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్మికులెవరూ బలవన్మరణాలకు పాల్పడవద్దని పోరాడి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.
- ఇదీ చూడండి : 'మీ మనసు నొచ్చుకుంటే నాకు బాధైతది'