ప్రభుత్వం ఎన్నో కష్ట నష్టాలను భరించి లాక్‌డౌన్ ప్రకటించిన దృష్ట్యా ప్రజలు స్ఫూర్తిని అర్ధం చేసుకోవాలని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి కోరారు. నగరంలో లాక్‌డౌన్ విరామసమయంలో ప్రజలు నిబంధనలు పాటిస్తున్నారా.. లేదా అనే అంశాన్ని స్వయంగా పరిశీలించారు. నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించేందుకు దాదాపు 200 మంది వాలంటీర్లను నియమించినట్లు సీపీ పేర్కొన్నారు.
ప్రజలు ప్రతిరోజు షాపింగ్‌కు వచ్చి వీధుల్లో రద్దీను పెంచకుండా రెండు మూడు రోజులకు అవసరమైన సరకులను ఒకేసారి కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఉదయం 6 గంటల నుంచి సడలింపు ఉన్నప్పటికీ హడావుడిగా 9గంటలకు ప్రజలు మార్కెట్‌కు వస్తున్నారని.. ఇక ముందు 10గంటల దాటిన తర్వాత వాహనాలను సీజ్ చేస్తామని సీపీ కమలాసన్‌రెడ్డి హెచ్చరించారు. లాక్‌డౌన్ స్ఫూర్తిని అర్ధం చేసుకుంటే కరోనాను అడ్డుకట్ట వేసుకోగలుగుతామని సీపీ కమలాసన్‌రెడ్డి సూచించారు.
ఇవీ చూడండి: పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కొత్త పోర్టల్