కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో గోల్ బంగ్లా శిథిలావస్థలో ఉండేది. నగరం నడిబొడ్డున ఉన్నా ఆ నిర్మాణంపై గతంలో పెద్దగా ఎవరు శ్రద్ద కనబర్చ లేదు. శిథిలావస్థలో ఉన్న ఈ బంగ్లాను పాత సామాన్లు నిల్వ చేయడానికి వినియోగించారు.
ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి హరితహారం, మియావాకి అడవుల పెంపకంపై దృష్టి సారించిన సీపీ కమలాసన్ రెడ్డి.. శిథిలావస్థలో ఉన్న గోల్ బంగ్లాపై దృష్టి పెట్టారు. నిజాం కాలంలో నిర్మించిన బంగ్లా ఆనవాళ్లు చెదిరిపోకుండా.. అందంగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక రూపొందించారు. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న గోల్ బంగ్లాను అందంగా తీర్చిదిద్ది చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదంగా మార్చారు.
గోల్ బంగ్లా పగలే కాకుండా రాత్రి వేళల్లోను మరింత ఆకర్షణీయంగా కనిపించే విధంగా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. పైకప్పుతో పాటు చెట్లకు చుట్టు ఏర్పాటు చేసిన గ్రీనరీ, వాటర్ ఫౌంటెన్లకు కూడా దీపాలను అలంకరించారు. మొన్నటి వరకు శిథిలావస్థలో బూత్‌బంగ్లా ఉన్న గోల్ బంగ్లా ప్రస్తుతం కమిషనరేట్‌లోనే కొత్త అందాన్నితెచ్చిపెట్టింది. కొత్తగా నిర్మించిన గోల్‌బంగ్లాను సందర్శించిన బీసీ సంక్షేమ శాఖమంత్రి గంగుల కమలాకర్‌తో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి.. సీపీ కమలాసన్‌రెడ్డిని అభినందించారు.